తమిళనాట‌ మ‌ళ్లీ హైడ్రామా.. VCK భారీ డిమాండ్లు

తమిళనాట‌ మ‌ళ్లీ హైడ్రామా.. VCK భారీ డిమాండ్లు

తమిళనాడు సీఎం పీఠంపై రోజుకో స‌స్పెన్స్ ఎదుర‌వుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ క్లైమాక్స్ దశకు చేరుకుందనేలోగా ఏదో ఒక పార్టీ తిర‌కాసు పెడుతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ నేతృత్వంలోని TVK, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ, ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఏదోర‌కంగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.

VCK భారీ డిమాండ్లు
రెండు అసెంబ్లీ స్థానాలు కలిగిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు భారీ డిమాండ్లు పెడుతోంది. ఒక‌ప‌క్క‌ మ‌ద్ద‌తు ఇస్తామంటూనే మ‌రోప‌క్క డీఎంకేతో మంత‌నాలు జ‌రుపుతోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌పోర్టు చేసేందుకు డిప్యూటీ సీఎం ప‌ద‌వితో పాటు, తిరుచ్చి ఈస్ట్ సీటు, నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని విజ‌య్ అవ‌కాశాన్ని ఆస‌రాగా మ‌ల్చుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ (5), CPI (2), CPI(M) (2) పార్టీలు TVKకు మద్దతు ప్రకటించాయి. VCK మద్దతుతో కలిపి విజయ్ కూటమి బలం 119కి చేరుకునే అవకాశం ఉంది. మ‌రి వీసీకే డిమాండ్ల‌కు టీవీకే త‌లొగ్గుతుందా అనేది వేచి చూడాలి.

TVK వర్సెస్ AMMK
మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై అర్ధరాత్రి నుంచి తీవ్ర వివాదం చెలరేగుతోంది. AMMK పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ తమకు మద్దతు ఇస్తున్నట్లు TVK గవర్నర్‌కు సమర్పించిన లేఖపై AMMK అధినేత టి.టి.వి. దినకరన్ మండిపడ్డారు. అది “ఫోర్జరీ లేఖ” అని, తమ ఎమ్మెల్యే సంతకాన్ని తప్పుగా సృష్టించారని ఆయన ఆరోపిస్తూ గిండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనికి కౌంటర్‌గా TVK ఒక వీడియోను విడుదల చేసింది. అందులో ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు విచారణకు దారితీసింది.

ఒక్క అడుగు దూరంలో ముఖ్యమంత్రి పదవి
శనివారం ఉదయం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, మెజారిటీ నిరూపించుకునే వరకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వేచి చూడాలని నిర్ణయించడంతో కార్యక్రమం వాయిదా పడింది. VCK అధికారికంగా మద్దతు లేఖ సమర్పిస్తే, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది. తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ ఒక సినీ నటుడు అధికార పీఠాన్ని అధిరోహించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment