తమిళనాడు అసెంబ్లీ.. గవర్నర్ వాకౌట్ – హైడ్రామా మొదలు

తమిళనాడు అసెంబ్లీ.. గవర్నర్ వాకౌట్ - హైడ్రామా మొదలు

Summarize with AI

తమిళనాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజు హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి, తన సంప్రదాయ ప్రసంగాన్ని రద్దు చేసి, అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఈ సంఘటనతో మొత్తం అసెంబ్లీ నివ్వెర‌పోయింది. అసెంబ్లీ మొదటి సెషన్‌లోనే జాతీయ గీతాన్ని అవమానించారని గవర్నర్ ఆరోపించారు.

తమిళనాడు అసెంబ్లీకి గవర్నర్ రవి హాజరైనప్పుడు, జాతీయ గీతం వినిపించకుండా ‘తమిళ తాయ్ వజ్తు’ అనే రాష్ట్ర గీతాన్ని మాత్రమే ప్రదర్శించారు. దీనిని గమనించిన గవర్నర్, రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని అవమానించినట్లు భావించి, తీవ్ర బాధతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాలని నిర్ణయించుకుని వెళ్లిపోయారు.

అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపులు
ఈ ఘ‌ట‌న అనంత‌రం అన్నా యూనివర్శిటీలో లైంగిక వేధింపులు జరిగిన సంఘటనపై అసెంబ్లీలో ఆందోళనలు మొదలయ్యాయి. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు, “యార్ అంత సర్” అంటూ బ్యాడ్జీలు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ సంఘటనపై తమ నిరసనను వ్య‌క్త‌ప‌రిచారు.

Join WhatsApp

Join Now

Leave a Comment