సిరియాలో తారస్థాయికి హింస.. 1000 మందికి పైగా మృతి

సిరియాలో తారస్థాయికి హింస.. 1000 మందికి పైగా మృతి

Summarize with AI

సిరియాలో హింస మరింత ఉధృతం అవుతోంది. బషర్ అల్ అసద్ (Bashar al-Assad) మద్దతుదారులు తిరుగుబాటుకు దిగడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి. భద్రతా దళాలు, అసద్ అనుచరుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

తిరుగుబాటు దాడుల్లో 1000 మందికి పైగా మృతిచెందారు. వారిలో 745 మంది సాధారణ పౌరులు, 125 మంది భద్రతా బలగాలు, 148 మంది అసద్ మద్దతుదారులు ఉన్నారు. ఈ దాడుల కార‌ణంగా లటికాయ నగరానికి విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వ‌స‌తుల స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జబ్లే, బనియాస్ ప్రాంతాల్లో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అనేక మంది మృతదేహాలు వీధుల్లో, ఇళ్లలో పడి ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ఎవ్వరూ సాహసం చేయడం లేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment