పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నం..

పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నం.. చివరికి సస్పెన్షన్!

Summarize with AI

హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారిపై (Trainee IPS) నమోదైన లైంగిక వేధింపుల కేసు (Sexual Harassment Case) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) తనను లైంగికంగా వేధించారని, బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి వేధింపులకు పాల్పడటమే కాకుండా వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బెదిరింపులకు దిగాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి సుమ(Suman) అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో (Attapur Police Station) ఫిర్యాదు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన శిక్షణలో ఉన్న అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

బాధిత అధికారిణి ఫిర్యాదు ప్రకారం, నిందితుడు ఆ వ్యక్తిగత వీడియోలను (Personal Videos) సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ (Blackmail) చేయడమే కాకుండా, వాటిని ఇప్పటికే ఆమె భర్తకు పంపి తీవ్ర మానసిక వేదనకు గురి చేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై (Uday Krishna Reddy) లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌తో పాటు సంబంధిత ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైప్రొఫైల్ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) ఆత్మహత్యాయత్నానికి (Suicide) పాల్పడినట్లు సమాచారం. మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో విషం తాగిన ఆయనను వెంటనే ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇంతలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి పై నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) కీలక చర్యలు తీసుకుంది. అకాడమీ ప్రివిలేజ్ కమిటీ (Academy Privilege Committee)నిర్వహించిన విచారణలో సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి, ఆయనపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఉదయ్‌కృష్ణారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఎన్‌పీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, భవిష్యత్తులో ఆయనను తిరిగి సర్వీస్‌లో చేర్చాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ (DoPT) తీసుకుంటుందని ఎన్‌పీఏ స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు, పరిపాలనా చర్యలు కొనసాగనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment