బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నివాసం ‘మన్నత్’ వద్ద అనుమానాస్పద వ్యక్తి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పొడవాటి నిచ్చెన ఉపయోగించి గోడ పైకి ఎక్కి, ఇంటి పరిసరాలను పరిశీలించినట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ ఘటనతో సంబంధం? ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యక్తి ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడే కావచ్చని. సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో ఆయనపై దాడి చేసిన విషయం ఇటీవల సంచలనంగా మారింది. ఇప్పుడే ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
షారుక్ ఇంటి భద్రత కట్టుదిట్టం
ఈ ఘటన తరువాత మన్నత్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఇటువంటి ఘటనలు కొనసాగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
దొంగ చేతిలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ హెల్త్‌బులిటెన్‌ను డాక్టర్లు విడుదల చేశారు. వెన్నులో దిగిన కత్తిని తొలగించారు. అదే విధంగా మెడపై అయిన గాయానికి సర్జరీ చేసిన వైద్యులు.. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.








