కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons). సితార ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై (Sithara Entertainments Banner) నాగవంశీ (Naga Vamsi) నిర్మించిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు (Censor Board) ఈ చిత్రానికి ‘U/A‘ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇక సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకి “పక్కా బిగ్ బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్”(Big Blockbuster Family Entertainer) అని పాజిటివ్ టాక్ వచ్చిందట.
సెన్సార్ అనంతరం సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా లాక్ అయింది. మొదటి సన్నివేశం నుంచి ముగింపు వరకు సినిమా అంతా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్, రోలర్ కోస్టర్ లాంటి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండి ఉంటుందని సెన్సార్ నివేదికలు చెబుతున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ డ్రామాతో వెంకీ అట్లూరి మరోసారి తన మార్క్ మేజిక్ రిపీట్ చేసినట్లు టాక్.
ఈ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా నటించింది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సూర్య నటించిన కరుప్పు బ్లాక్ బస్టర్ కావడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ పై పాజిటివ్ బజ్ ఉంది. మరి ఆడియెన్స్ ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.








