త్వ‌ర‌లో భార‌త గ‌డ్డ‌పై అడుగుపెడ‌తా.. – సునీతా విలియ‌మ్స్‌

త్వ‌ర‌లో భార‌త గ‌డ్డ‌పై అడుగుపెడ‌తా.. - సునీతా విలియ‌మ్స్‌

Summarize with AI

నాసా (NASA) ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తన తాజా అంతరిక్ష అనుభవాలను ప్రపంచంతో పంచుకున్నారు. తొమ్మిది నెలల పాటు స్పేస్‌లోనే గడిపిన ఆమె, ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, అంతరిక్షం (Space) నుంచి భారత్ (India) ఎలా కనిపించిందో వివరించారు.

భారతదేశాన్ని అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఎంతో ముగ్ధురాలిని అయ్యాను అని సునీత తెలిపారు. “భారత్ అద్భుతం.. మహా అద్భుతం!” అంటూ ప్రశంసలు కురిపించారు. హిమాలయాల మీదుగా ప్రయాణించేటప్పుడు ఆ దృశ్యం అద్భుతంగా అనిపించిందని, బుచ్ విల్మోర్ కెమెరాలో ఆ క్షణాలను బంధించారని చెప్పారు. గుజరాత్ (Gujarat), ముంబై (Mumbai) మీదుగా వెళ్లినప్పుడు జాలర్ల పడవలు సిగ్నల్ లైట్లలా (Signal Lights) కనిపించాయని వివరించారు.

భారత్‌లో పర్యటించే అవకాశంపై స్పందించిన సునీత, “నా తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే సందర్శిస్తాను. బంధువులతో, ప్రజలతో నా అంతరిక్ష అనుభవాలను పంచుకుంటాను” అని తెలిపారు. అలాగే, భారత అంతరిక్ష యాత్రలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

జూన్‌లో సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎనిమిది రోజుల యాత్ర కోసం బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే, ప్రొపల్షన్ సమస్యల కారణంగా వారి యాత్ర పొడిగించబడింది. చివరికి మార్చి 19న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ (SpaceX Dragon) ద్వారా భూమికి తిరిగి చేరుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment