టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా.. వైసీపీలో చేరనున్నారా?

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా.. వైసీపీలో చేరనున్నరా?

Summarize with AI

తెలుగుదేశం పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు పార్టీలో జరిగిన అవమానాలు, ఆయన విగ్రహ ఏర్పాటుకు ఎదురైన అడ్డంకులే తన నిర్ణయానికి కారణమని ఆమె ఆరోపించారు. నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన పార్టీని వీడాల్సి రావడం బాధగా ఉందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ పరిణామం శ్రీకాకుళం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తన భర్త గుండ అప్పల సూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారని లక్ష్మీదేవి గుర్తుచేశారు. తాము సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించామని, టీడీపీ బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. అయితే గత పదేళ్లుగా తన భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, పలుమార్లు చంద్రబాబును కలిసి తమ సమస్యలను వివరించినప్పటికీ పరిష్కారం లభించలేదని ఆరోపించారు. తన భర్త మరణం తర్వాత కూడా తమ కుటుంబాన్ని, తమను నమ్ముకున్నవారిని అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అడ్డంకులు సృష్టించారని లక్ష్మీదేవి ఆరోపించారు. విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు జరిగిన పరిణామాలు, పార్టీ శ్రేణుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తనకు ఫోన్‌ చేసి పార్టీని వీడవద్దని కోరినట్లు లక్ష్మీదేవి తెలిపారు. అయినప్పటికీ తనను నమ్ముకుని ఉన్నవారికి పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని ఆరోపిస్తూ, వారి కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుబంధం ఉన్న టీడీపీని వీడటం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. గుండ లక్ష్మీదేవి రాజీనామా నిర్ణయం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాజకీయాలపై చర్చ మొదలైంది.

మరోవైపు శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయం అని జిల్లాలో టాక్ వినిపిస్తుంది. 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి ముగింపు పలికి వైసీపీలోకి చేరనున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment