శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు..

శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు..

Summarize with AI

టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ (Cricketer శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సోదరి (Sister) శ్రేష్ఠ అయ్యర్ (Shresta Iyer) ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో తనకు ఎదురైన తీవ్ర ఆన్‌లైన్ ట్రోలింగ్ (Online Trolling) గురించి భావోద్వేగంగా స్పందించారు. ఐపీఎల్(IPL) సందర్భంగా వైరల్ అయిన ఓ వీడియో తర్వాత తనపై వ్యక్తిగత దూషణలు, అసభ్య కామెంట్లు(Obscene Comments), రూపం(Appearance), వ్యక్తిత్వం (Personality), శరీరాకృతిపై (Body Shape) అవమానకర వ్యాఖ్యలు వెల్లువెత్తాయని ఆమె తెలిపారు. అంతేకాదు, కొందరు తనకు అత్యాచార బెదిరింపులు, ప్రాణహాని హెచ్చరికలు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు కేవలం తనకే పరిమితం కాకుండా, తాను పనిచేస్తున్న సంస్థను కూడా లక్ష్యంగా చేసుకుని సహోద్యోగులకు (Colleagues) తెల్లవారుజామున ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు.

ఈ చేదు అనుభవాలే తన సోదరుడు శ్రేయస్ అయ్యర్ సోషల్ మీడియాకు (Social Media) దూరంగా ఉండేందుకు ప్రధాన కారణాల్లో ఒకటని శ్రేష్ఠ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడటం ఏ మాత్రం సమంజసం కాదని ఆమె పరోక్షంగా సూచించారు. ఐపీఎల్ సమయంలో జరిగిన ఆ వివాదంపై తొలిసారి బహిరంగంగా స్పందించిన శ్రేష్ఠ.. “నాకు అత్యాచార బెదిరింపులు (Rape Threats) వచ్చాయి. నా రూపం, వ్యక్తిత్వం, శరీరం గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి మనస్తత్వాన్నే అవి ప్రతిబింబిస్తాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment