కొద్దిరోజులుగా హీరోయిన్ సమంత (Samantha) ప్రెగ్నెన్సీకి (Pregnancy) సంబంధించిన వార్తలు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఇటీవల ‘మా ఇంటి బంగారం’(Maa Inti Bangaram) సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో (Success Celebrations) సమంత కనిపించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఆమె గర్భవతి (Pregnant) అనే ప్రచారం మరింత ఊపందుకుంది. అనంతరం మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) కలిసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అభిమానులు భావించారు. దీంతో సమంత వ్యక్తిగత జీవితంపై (Personal Life) నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగింది.
తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో సమంత చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వరుస సినిమాల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “సారీ అండి.. మరోసారి గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. నేను మెటర్నిటీ లీవ్ (Maternity Leave) తీసుకోవాలి” అని చెప్పినట్లు సమాచారం. దీంతో గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ప్రెగ్నెన్సీ వార్తలకు సమంత స్వయంగా క్లారిటీ ఇచ్చినట్లయిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ వార్తతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.








