ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్… రోహిత్ శర్మ రీఎంట్రీ!

ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్… రోహిత్ శర్మ రీఎంట్రీ!

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అభిమానులకు ఐపీఎల్(IPL) 2026లో ఊరటనిచ్చే వార్త అందింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ముంబై జట్టుకు ప్రధాన ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే (Paras Mhambrey) కీలక అప్డేట్ ఇచ్చారు. గాయం కారణంగా ఆర్‌సీబీ మ్యాచ్‌కు(RCB Match) దూరమైన రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నారని, నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారని ఆయన తెలిపారు. అదే విధంగా మిచెల్ సాంట్నర్ కూడా అనారోగ్యాన్ని అధిగమించి ఫిట్‌గా ఉన్నారని వెల్లడించడంతో జట్టులో ఉత్సాహం పెరిగింది. అయితే రోహిత్ తుది జట్టులోకి తిరిగి రావడంపై ఇంకా కొంత సస్పెన్స్ కొనసాగుతోంది.

ఈరోజు గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) కీలక మ్యాచ్ జరగనుండగా, ముంబైకి ఈ వేదికపై ఇప్పటివరకు విజయాలు సాధించలేకపోవడం మరో ఒత్తిడిగా మారింది. రోహిత్ అందుబాటులోకి వస్తే జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత బలపడే అవకాశం ఉండగా, విదేశీ ఆటగాళ్ల కూర్పులో కూడా మార్పులు తప్పవు. మరోవైపు క్వింటన్ డికాక్ (Quinton de Kock) అద్భుత శతకంతో ఫామ్‌లోకి రావడం జట్టుకు సానుకూల అంశంగా మారింది. రోహిత్ పూర్తిగా ఫిట్ అయితేనే బరిలోకి దిగే అవకాశం ఉండటంతో, ఫ్యాన్స్ అతని రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment