వరి నారుతో సీఎం రేవంత్‌కు వినూత్న శుభాకాంక్షలు!

వరి నారుతో సీఎం రేవంత్‌కు వినూత్న శుభాకాంక్షలు!

Summarize with AI

సాధారణంగా తమకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజు సందర్భంగా చాలామంది శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana Chief Minister) రేవంత్ రెడ్డి(Revanth Reddy) పుట్టినరోజు (Birthday)సందర్భంగా కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ (Mettu Sai Kumar)వినూత్నంగా విషెస్ తెలిపారు. వరి నారును(Paddy Saplings) ఉపయోగించి పొలంలోనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని(Portrait) రూపొందించారు.

నవంబర్ 8న సీఎం పుట్టినరోజు కావడంతో ఈ ప్రత్యేక చిత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఇందుకోసం దాదాపు 20 రోజుల పాటు శ్రమించి, వరి నారుతో ముఖ్యమంత్రి రూపాన్ని పొలంలో అందంగా తీర్చిదిద్దారు. ఈ వినూత్న ప్రయత్నం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రైతు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రపటాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్‌లు, ఇతర కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. అందుకు భిన్నంగా వ్యవసాయ క్షేత్రంలో(Agricultural Field) వరి నారుతో సీఎం చిత్రాన్ని రూపొందించడం ప్రత్యేకతగా నిలిచింది. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా మెట్టు సాయికుమార్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment