సీఎం రేవంత్ బెంగళూరు పర్యటన రద్దు.. కారణం ఇదే!

సీఎం రేవంత్ బెంగళూరు పర్యటన రద్దు.. కారణం ఇదే!

Summarize with AI

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన బెంగళూరు (Bengaluru) పర్యటనను రద్దు చేసుకున్నారు. నిర్ణిత‌ షెడ్యూల్ ప్ర‌కారం ఆయన కాంక్లేవ్ (Conclave) కార్యక్రమానికి హాజరుకావాల్సిన సమయంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానయాన రంగంలో చోటు చేసుకున్న కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌ధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రతా చర్యలను అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రయాణికుల భద్రత కోసం జారీ చేసిన ఆదేశాలు
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో (Airports) భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఆదేశించింది. ప్రయాణికులతో సెకండరీ లాడర్ పాయింట్ చెక్ (SLPC) చేపట్టాలని నిర్ణయించారు. టెర్మినల్ భవనాల్లో సందర్శకులు (Visitors) వచ్చే అవకాశం లేదని నిషేధం విధించారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు కనీసం మూడు గంటల ముందే చేరుకోవాలని సూచించారు. అలాగే, చెక్-ఇన్ 75 నిమిషాల ముందే ముగించవలసిన అవసరం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment