మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కుడి చేతి మణికట్టు సమస్యకు (Right Hand Wrist Issue) తమిళనాడులోని (Tamil Nadu) కోయంబత్తూరు (Coimbatore) గంగా హాస్పిటల్‌లో (Ganga Hospital) విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ ఎస్. రాజశేఖరన్ (S. Rajasekaran), అంతర్జాతీయ స్థాయి హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బాడియా (Alejandro Badia) సంయుక్తంగా నిర్వహించారు. వీరితో పాటు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ (Praveen Bharadwaj) మరియు వైద్య బృందం కూడా ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించి శస్త్రచికిత్సను విజయవంతంగా (Surgery Successfully) పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సర్జరీ అనంతరం తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఊరట కలిగిస్తోంది.
రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, రామ్ చరణ్ త్వరగా కోలుకుని అదే ఉత్సాహంతో సెట్స్‌లోకి తిరిగి రావాలని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.









‘మీ ఎనర్జీ అలాగే ఉంచుకోండి’.. – ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ కీలక సందేశం