బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస్ కుమార్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of The Dragon ) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఎస్కేఎన్(SKN) తెలుగు హీరోయిన్లుపై షాకింగ్ కామెంట్ (Controversy Comments) చేశారు. తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే.. తెలుగు మాట్లాడని అమ్మాయిలనే తాము ఎక్కువగా లవ్ చేస్తామని, తెలుగు వచ్చిన అమ్మయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తనకు తర్వాత తెలిసి వచ్చిందన్నారు. కాబట్టి, తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని తాను, తన డైరెక్టర్ కల్ట్ సాయి రాజేశ్ కోరుకుంటున్నట్లుగా చెప్పారు.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హీరోయిన్ కాయద్ లోహర్ పేరుపై కూడా నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. తెలుగులో కాయలు, పండ్లకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని కామెంట్ చేశారు. ఇది మంచి అర్థమే అని తాను చేసిన సెటైరికల్ కామెంట్స్‌ను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు ఎస్కేఎన్.
తెలుగు రాని అమ్మాయిలను లవ్ చేస్తాం.. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయం అంటూ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎస్కేఎన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ.. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయబోమని తెలుగు సినిమా వేదికపైనే చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. బేబి బ్లాక్‌బస్టర్ హిట్‌కు తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) నటనే ప్రధాన కారణం అని కామెంట్లు పెడుతున్నారు. ఎస్కేఎన్ ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.








