ప్రకాష్ రాజ్‌ను మూడు గంటలుగా విచారిస్తున్న ఈడీ!

ప్రకాష్ రాజ్‌ను మూడు గంటలుగా విచారిస్తున్న ఈడీ!

జంగిల్ రమ్మీ (Jungle Rummy) అనే బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్ చేసిన కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారిస్తున్నారు. పది రోజుల క్రితం ఈడీ నోటీసులు అందుకున్న ప్రకాష్ రాజ్, తన న్యాయవాదితో కలిసి హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు.

బ్యాంక్ స్టేట్‌మెంట్ల సమర్పణ:
ప్రకాష్ రాజ్ ప్రమోషన్‌కు మూడు నెలల ముందు, అలాగే ప్రమోట్ చేసిన తర్వాత ఆరు నెలల వరకు ఉన్న తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను వెంట తెచ్చుకొని ఈడీ అధికారులకు అందజేశారు. అయితే, విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించబోమని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.

దుబాయ్ లావాదేవీలపై ఈడీ దృష్టి
దాదాపు మూడు గంటలుగా ప్రకాష్ రాజ్‌ను ఈడీ విచారిస్తోంది. జంగిల్ రమ్మీ ద్వారా భారీగా లాభాలు పొందినట్లు ఈడీ గుర్తించింది. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుండి లావాదేవీలు జరిగినట్లు తేలింది. ప్రకాష్ రాజ్ దుబాయ్ నుండి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. అందుకోసం ఐదు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. మరోవైపు ప్రకాష్ రాజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తోంది.

ప్రకాష్ రాజ్ గతంలో ఇచ్చిన వివరణ
గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై ప్రకాష్ రాజ్ స్పష్టత ఇచ్చారు. తాను గతంలో జంగిల్ రమ్మీకి ప్రమోషన్ చేసిన మాట వాస్తవమే కానీ, వారితో కాంట్రాక్టు పూర్తయ్యాక మళ్ళీ రెన్యూవల్ చేయలేదని తెలిపారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment