ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన య‌జ‌మాని

ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన య‌జ‌మాని

Summarize with AI

ఉద్యోగులు అసాధారణ ప్రతిభ కనబరిస్తే కంపెనీలు బోనస్‌లు, ప్రమోషన్లు ఇవ్వడం సాధారణమే. కానీ, దుబాయ్‌కి చెందిన ‘రిచ్‌కీ ప్రాపర్టీస్’ (Richkey Properties) సంస్థ తన టాప్ పెర్ఫార్మర్‌కు ఏకంగా రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్ (Lamborghini Urus) లగ్జరీ కార్‌ను బహుమతిగా అందించి సంచలనం సృష్టించింది.

కంపెనీ మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థ సీఈఓ దబాన్ ఉత్మాన్ అగ్రగామి ఉద్యోగిని నటాలియా చావెజ్ (Natalia Chavez)కు వేదికపై అవార్డు అందజేశారు. అవార్డు తీసుకుని ఆమె తన సీటు వద్దకు వెళ్తుండగా సీఈఓ ఆపి, మరో సర్ప్‌రైజ్ ఉందంటూ కౌంట్‌డౌన్ తర్వాత రిబ్బన్ తొలగించి నీలం రంగు లంబోర్గిని ఉరుస్ కారును ఆవిష్కరించారు. ఊహించని ఈ బహుమతికి నటాలియా ఆశ్చర్యానికి లోనయ్యారు.

రూ.4,400 కోట్ల సేల్స్ టార్గెట్
నటాలియాకు ఈ స్థాయి ఖరీదైన బహుమతి లభించడానికి ఆమె సాధించిన అద్భుతమైన వ్యాపారమే కారణం. గత రెండేళ్లలో ఆమె ఏకంగా 500 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.4,400 కోట్లు) విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తుల లావాదేవీలను పూర్తి చేశారు.

2026 ప్రథమార్థంలో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచిన ఆమె.. ఏడాది మొత్తానికి గాను అత్యుత్తమ ఉద్యోగినిగా ఎంపికై నాలుగు ప్రధాన పురస్కారాలను గెలుచుకున్నారు. ఈ అరుదైన బహుమతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు ఆమె కృషికి, కంపెనీ ఉదారతకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment