పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-Release Event) అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఈ వేదికపై పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత జీవితం, రాజకీయం మరియు సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అదే సమయంలో ఆయన చెప్పిన ఒక ‘గుర్రం’ కథపై (Horse Story Incident) నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
16 గంటల కష్టం.. వ్యాపారాలు లేవు!
తన రాజకీయాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకు ఇతరులలాగా కోట్లాది రూపాయల వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. నా బాధ్యతలను వదిలేసి సినిమాలు (Movies) చేయడం లేదు. రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయడం కోసం రోజుకు 16 గంటలు శ్రమిస్తున్నాను” అని పవన్ అన్నారు ఒక్కోసారి సినిమాలను వదిలేయాలని అనిపించినా, సినిమా (Movie) తన రక్తంలోనే (My Blood) జీర్ణించుకుపోయిందని, తన నిర్మాతలు, అభిమానులు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు.
“గుర్రం చెవిలో ఏం చెప్పారు?”.. నెటిజన్ల ట్రోలింగ్
సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పవన్ కల్యాణ్ పంచుకున్నారు. తనకు హార్స్ రైడింగ్ (Horse Riding) రాదని, ఒక సీన్ కోసం గుర్రాన్ని తీసుకొచ్చినప్పుడు దాని చెవిలో.. “నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లు” అని చెప్పానని ఆయన అన్నారు. “గుర్రానికి ఏ భాషలో చెప్పారు కల్యాణ్ గారు? తెలుగులోనా లేక గుర్రాల భాషలోనా?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నెట్టింట రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి.








