జనసేన పార్టీ(Jana Sena Party) 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను(Foundation Day) ఆడంబరాలకు దూరంగా, గిరిజన పల్లెల్లో(Tribal Villages) జరుపుకోవాలని నిర్ణయించుకున్న పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan). శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని (Paderu Constituency) నందిగరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ‘మాటా-మంతి’ (Mata-Manthi Interaction Program) నిర్వహించి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
రహదారుల నిర్మాణం నా బాధ్యత
నందిగరువులో గిరిజనులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. “మీరెవరూ నన్ను కలిసి రోడ్లు వేయాలని అడగలేదు. కానీ, ఈ ప్రాంతంలో సరైన రహదారి సౌకర్యం లేక గర్భిణులు, రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే ‘అడవితల్లి బాట’ (Adivithalli Bata Program) కార్యక్రమం ద్వారా రహదారుల నిర్మాణానికి ఉపక్రమించా” అని ఆయన వెల్లడించారు.
గిరిజనులతో మమేకం
ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ కేవలం రాజకీయ నాయకుడిలా కాకుండా, గిరిజనుల్లో ఒకరిగా మమేకమయ్యారు. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నందిగరువు వరకు నిర్మించిన నూతన రహదారిని పరిశీలించారు. గిరిజనులతో కలిసి పంక్తి భోజనం చేసి, వారి సంస్కృతి, ఆచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజక వర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ… pic.twitter.com/vWn7Gb76Ub
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2026








