ప్రస్తుతం ఇంగ్లాండ్ (England) పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రదర్శనపై ఆస్ట్రేలియా (Australia) కెప్టెన్ (Captain) ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియా (Team India) కొత్త జట్టు (New Team)ను చూస్తే భయమేస్తోందని (Feels Fear) వ్యాఖ్యానించాడు.
రెండో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో కమిన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా యువ కెప్టెన్ శుభమన్ గిల్ (Shubman Gill) రెండు టెస్టుల్లో మూడు సెంచరీలతో 500కు పైగా పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఆకాష్ దీప్ (Akash Deep) 10 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.
వెస్టిండీస్‌తో సిరీస్ గెలిచిన అనంతరం కమిన్స్ మాట్లాడుతూ, “గిల్ సేనను చూస్తుంటే భయం వేస్తోంది. ఆ బ్యాటర్లు అలా ఆడతారని అనుకోలేదు. ఫ్లాట్ పిచ్‌లలో బౌలర్లకు సహకారం లేకపోయినా, టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు” అని ప్రశంసించాడు. తాను మ్యాచ్ మొత్తం చూడలేదని, కానీ స్కోర్లు చూశానని, భారత్ ప్రతి విభాగంలోనూ బాగా ఆడిందని కమిన్స్ పేర్కొన్నాడు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’