ఆప్ఘనిపై పాక్ వైమానిక దాడి.. చిన్నారులు సహా 10 మంది మృతి

ఆప్ఘనిపై పాక్ వైమానిక దాడి.. చిన్నారులు సహా 10 మంది మృతి

Summarize with AI

ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)పై పాకిస్థాన్ (Pakistan) మరోసారి వైమానిక దాడులు (Airstrikes) జరిపింది. ఖోస్ట్ ప్రావిన్స్‌ (Khost Province)లోని గోర్బుజ్ జిల్లా (Gurbuz District)లో సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో 10 మంది పౌరులు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం ప్రకటించారు.

మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన ఒక మహిళ తరువాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మొత్తం మరణాల సంఖ్య 10కి చేరిందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో కునార్ మరియు పాక్టికా ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ వైమానిక దాడులు జరిగాయని అధికారులు తెలియజేశారు. ఇక్కడ నలుగురు పౌరులు గాయపడ్డట్లు సమాచారం.

తాజా ఘటనల నేపథ్యంలో అమెరికా మాజీ రాయబారి జల్మయ్ ఖలీల్దాద్ ఇరు దేశాలు దౌత్య మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఇక రెండు దేశాల మధ్య సయోధ్య కోసం టర్కీకి చెందిన మధ్యవర్తిత్వ బృందం త్వరలో ఇస్లామాబాద్, కాబూల్‌లకు వెళ్లనున్నట్లు సమాచారం.

కొన్ని రోజులుగా పాక్–ఆఫ్ఘన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగినా స్పష్టమైన ఫలితం రాలేదు. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్థాన్ భారత్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడం పాకిస్థాన్‌ను అసహనానికి గురిచేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఆఫ్ఘనిస్థాన్‌పై వరుసగా వైమానిక దాడులకు దిగుతోందని సూచనలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment