ఉత్తర భారత్‌కు కోల్డ్‌వేవ్‌ హెచ్చరిక

ఉత్తర భారత్‌కు కోల్డ్‌వేవ్‌ హెచ్చరిక

Summarize with AI

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) కోల్డ్‌వేవ్‌ హెచ్చరిక జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి ఉండే అవకాశముందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు కురుస్తుండటంతో రెండు రోజుల పాటు తీవ్ర చలి కొనసాగుతుందని IMD సూచించింది.

కశ్మీర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం
కశ్మీర్‌లో మంచు ప్రభావంతో రోడ్లపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రదేశంలో పలు విమానాలు మరియు రైళ్లు రద్దు చేయబడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే ఢిల్లీకి ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment