రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

Summarize with AI

నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోధన్ మండలం ఆమ్దాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవత్ రక్షిత్ (26) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.

బోధన్ పట్టణంలోని ఆటో నగర్ పెట్రోల్ బంక్ సమీపంలో రక్షిత్ బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలను పోలీసులు గుర్తించాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment