ఉగ్రవాదులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ.. కుట్రపై ఆరా

ఉగ్రవాదులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ.. కుట్రపై ఆరా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉగ్రవాద నెట్‌వర్క్ కేసులో (Terrorism Network Case) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వేగం పెంచింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) రిమాండ్‌లో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో ఎన్ఐఏ అధికారులు ఇవాళ (సోమవారం) తమ కస్టడీలోకి (Custody) తీసుకున్నారు. ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఈ కస్టడీ కొనసాగనుంది. రాజమండ్రి జాంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో నిందితులను ఎన్ఐఏ బృందం సుదీర్ఘంగా విచారిస్తోంది.

విజయవాడలో లింక్.. 8 రాష్ట్రాల్లో అరెస్టులు
ఈ ఏడాది మార్చిలో విజయవాడలో (Vijayawada) ముగ్గురు అనుమానిత నిందితులను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వీరిచ్చిన సమాచారంతో అలర్ట్ అయిన ఎన్ఐఏ, స్థానిక పోలీసులు దేశవ్యాప్తంగా జరిపిన మెరుపు దాడుల్లో మరో 13 మందిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సహా మొత్తం 8 రాష్ట్రాల్లో ఈ అరెస్టులు జరిగాయి.

ఐసిస్, అల్-ఖైదా భావజాలం..
నిందితులంతా అంతర్జాతీయ (International) నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్ (ISIS), అల్-ఖైదా (AQIS) వంటి సంస్థల భావజాలానికి ఆకర్షితులైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లు, ఎన్‌క్రిప్టెడ్ చాట్స్, ఫోన్ కాల్ డేటా మరియు బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

దేశంలో ఎక్కడైనా భారీ పేలుళ్లకు, విధ్వంసానికి కుట్ర పన్నారా? వీరికి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి? అనే కోణంలో ఎన్ఐఏ ఒక ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసి నిందితుల నుంచి సమాధానాలు రాబడుతోంది. ఐదు రోజుల కస్టడీ అనంతరం నిందితుల నుంచి రాబట్టిన కీలక సమాచారాన్ని ఎన్ఐఏ కోర్టుకు సమర్పించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment