నంద్యాల‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి

నంద్యాల‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి

Summarize with AI

మొన్న విశాఖ‌లో ప్రేమోన్మాది దాడి.. నిన్న నిండు గ‌ర్భిణిని హ‌త్య చేసిన భ‌ర్త‌.. ఇవాళ తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh)లో వ‌రుస‌గా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఆడ‌వారిపై నిత్యం జ‌రుగుతున్న దాష్టీకాలకు అంతులేకుండా పోతోంద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా (Nandyal District) డోన్ (Dhone) ప్రాంతంలో హృదయ విదారక ఘటన ఒకటి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలిక (Nine-Year-Old Girl)పై ఆచారి (Achari) అనే వ్యక్తి అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు.

బాధిత బాలిక ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా, వెంటనే ఆమె పోలీసులకు (Police) ఫిర్యాదు (Complaint) చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రాగానే స్థానికంగా తీవ్ర ఆందోళ‌న వ్యక్తమవుతోంది. బాలిక తల్లిదండ్రులు (Parents) నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. బాలిక భద్రతతో పాటు, ఆమెకు అవసరమైన సహాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment