‘భ‌ర్త‌ను బాత్రూంలో దాచేది’.. నందూస్ వరల్డ్ స్కాంలో మరో సంచలన వీడియో

'భ‌ర్త‌ను బాత్రూంలో దాచేది'.. నందూస్ వరల్డ్ స్కాంలో మరో సంచలన వీడియో

Summarize with AI

‘నందూస్ వరల్డ్’(Nandoos World) వ్యవహారంలో మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితుడిగా పేర్కొంటున్న తమిళనాడుకు (Tamil Nadu) చెందిన ఓ వ్యక్తి తాజాగా సెల్ఫీ వీడియో(Selfie Video) విడుదల చేశారు. ‘నందూస్ కిచెన్‌’లో(Nandoos Kitchen) తాను ఉద్యోగిగా పనిచేశానని చెప్పిన ఆయన.. నందు, ఆమె భర్త మధుకర్‌ (Madhukar) వ్యవహారాలపై పలు ఆరోపణలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీసా(Visa), ఉద్యోగాలు (Jobs) పేరుతో యువ‌త జీవితాల‌తో ఆడుకున్నారంటూ జాగ‌ర్ల‌మూడి నంద‌న‌(Jagarlamudi Nandana), ఆమె భ‌ర్త జాగ‌ర్ల‌మూడి మ‌ధుక‌ర్ (Jagarlamudi Madhukar) దంప‌తుల‌తో కృష్ణా జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో కేసు న‌మోదు అయ్యింది. వీరిపై లుక్ అవుట్ నోటీసులు (Lookout Notices) కూడా అయ్యాయి. తాజాగా ఇండియాకు వ‌చ్చిన రమా నంద‌న‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే బాధితులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన ఓ బాధితుడు సెల్ఫీ వీడియో విడుద‌ల చేసి.. సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. తన వద్ద ఒప్పంద పత్రాలు, ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వచ్చి పోలీసులకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

తాను ‘నందూస్ కిచెన్‌’లో(Nandoos Kitchen) ఉద్యోగిగా పనిచేశానని, మూడు సంవత్సరాల పాటు డబ్బులు చెల్లించినప్పటికీ.. కేవలం ఏడాది మాత్రమే అక్కడ పనిచేశానని ఆరోపించారు. నంద‌న దంప‌తుల కార‌ణంగా చాలా మంది తమ జీవితాలు, కలలు, పిల్లల భవిష్యత్తును కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.

తాను అక్కడ పనిచేస్తున్న సమయంలో పలువురు బాధితులు, వారి కుటుంబాలు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ రెస్టారెంట్‌కు వచ్చేవారని వీడియోలో తెలిపారు. అయితే నందు, ఆమె భర్త మధుకర్‌ బాధితులకు అందుబాటులో ఉండేవారు కాదని, కొన్ని సందర్భాల్లో మధుకర్‌ను కార్యాలయం వెనుక ఉన్న టాయిలెట్‌లో రెండు, మూడు గంటలు, ఒక్కోసారి రోజంతా దాచేవారని ఆయన ఆరోపించారు. యూకేలో(UK) వీసా లేదా ఉద్యోగం లేకపోవడంతో పలువురు అక్కడే చిక్కుకుపోయి, తిరిగి భారత్‌కు(India) రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని బాధితుడు పేర్కొన్నారు.

తనకు రావాల్సిన పెండింగ్ జీతం, పీఎఫ్‌ తదితర బకాయిలతో పాటు ఎక్స్‌పీరియన్స్ లెటర్‌, రిలీవింగ్ లెటర్‌ కూడా అడిగానని బాధితుడు తెలిపారు. అయితే తనకు ఎలాంటి పత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు. తన వద్ద నందూస్ కిచెన్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌, తాను చేసిన పనులకు సంబంధించిన పలు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అవసరమైన సమయంలో వాటిని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

‘‘నందు మేడమ్‌కు పిల్లలు ఉన్నారు. నాకు కూడా పిల్లలు ఉన్నారు’’ అంటూ తన కుమార్తెను వీడియోలో చూపించారు. తమ సమావేశాలు, వ్యవహారాలు నిజాయితీగా ఉంటే తమకు రావాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతరుల డబ్బులతో జీవిస్తున్నారంటూ నందు, మధుకర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇప్పటికే ‘నందూస్ వరల్డ్’ వ్యవహారానికి సంబంధించి పలువురు బాధితులు తమకు నష్టం జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో వ్యక్తి విడుదల చేసిన ఈ వీడియో చర్చకు దారితీసింది.

మరోవైపు ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణ తీరుపైనా కొందరు బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన విచారణకు ఒక రోజు ముందే రమానందనను విచారించడం, ఆ విచారణ కేవలం అరగంట మాత్రమే సాగిందనే ప్రచారం కూడా బాధితుల మధ్య చర్చకు కారణమైంది. ఈ నేపథ్యంలో ‘నందూస్ వరల్డ్’ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలనే డిమాండ్లు మరింతగా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment