శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్..

శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్..

Summarize with AI

దివంగత ‘రియల్ స్టార్’ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న యాక్షన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘ఆస్మాన్’ (Aasmaan) టీజర్ విడుదలైంది. రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీజర్‌ను లాంచ్ చేశారు. కంబోడియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అడవి నేపథ్యంలో ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటుండగా.. మేఘాంశ్ పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో కనిపించారు.

టీజర్‌లో ఓ కుటుంబం, వారి మూఢనమ్మకాలు, దుష్టశక్తులకు సంబంధించిన కలవరపరిచే ఘటనలను ప్రధానంగా చూపించారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న సమయంలో మేఘాంశ్ పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే కుటుంబానికి ఎదురైన సమస్య ఏమిటి? దానిని పరిష్కరించేందుకు మేఘాంశ్ ఎందుకు రంగంలోకి దిగారు? అనే విషయాలను మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. సస్పెన్స్, హారర్, యాక్షన్ అంశాలతో కథపై ఆసక్తి పెంచేలా టీజర్‌ను రూపొందించారు.

‘రాజ్ దూత్’, ‘కోతి కొమ్మచ్చి’ చిత్రాల తర్వాత మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న ఈ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేఘాంశ్ సరసన రాయంచ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవివర్మ, కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగు సహా పాన్ ఇండియా స్థాయిలో, అరబిక్ భాషలోనూ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment