జోస్ బట్లర్‌ దుమ్మురేపాడు.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

జోస్ బట్లర్‌ దుమ్మురేపాడు.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

Summarize with AI

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (Jos Buttler) మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. శ్రీలంకతో(Sri Lanka) జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో(T20 International Match) బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు (Most Runs) చేసిన బ్యాటర్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma) బట్లర్ అధిగమించాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 4,292 పరుగులు ఉండగా.. రోహిత్ శర్మ 4,231 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) 4,596 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 49 బంతుల్లోనే అజేయంగా 114 పరుగులు చేశాడు.

బట్లర్, బ్రూక్ కలిసి మూడో వికెట్‌కు కేవలం 60 బంతుల్లో 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. దునిత్ వెల్లలాగే 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివరికి శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. బట్లర్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ అద్భుతమైన అనుభవమేనని ప్రశంసించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment