మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. జాన్ బోల్టన్ సంచ‌ల‌న కామెంట్స్‌

మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. జాన్ బోల్టన్ సంచ‌ల‌న కామెంట్స్‌

Summarize with AI

భార‌త‌ (India) ప్రధాని మోడీ (Modi)- అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య స్నేహం (Friendship) ముగిసిపోయిందని అగ్ర‌రాజ్యం మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John Bolton) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ్రిటిష్ మీడియా (British Media) పోర్టల్ ఎల్‌బీసీ (LBC)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా కొనసాగిన అమెరికా-భారత్ బంధాన్ని సుంకాలే దెబ్బతీశాయని స్పష్టం చేశారు. ఒకప్పుడు ట్రంప్-మోడీ మధ్య బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఆ స్నేహం కనుమరుగైందని తెలిపారు. ఇది అందరికీ ఒక పాఠమని బోల్టన్ అన్నారు.

చైనా-రష్యా సమీకరణలపై స్పందన
చైనా (China)లో జరిగిన ఎస్‌సీవో (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, రష్యా-చైనా నాయకులతో కలిసి ఉన్న నేపథ్యంలో ప్రపంచ క్రమం మారుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్‌ వైఖరి, అలాగే ట్రంప్ విధించిన సుంకాలే ఈ పరిస్థితికి దారితీసినట్లు బోల్టన్ అభిప్రాయపడ్డారు.

ట్రంప్ నిర్ణయాలపై విమర్శలు
2018 ఏప్రిల్‌ నుంచి 2019 సెప్టెంబర్‌ వరకు ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న బోల్టన్, ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా తప్పుపడుతున్నారు. ట్రంప్ దగ్గర పనిచేసిన వ్యక్తే ఇప్పుడు ఆయన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం గమనార్హం. భారత్‌పై మొదటగా ట్రంప్ 25% సుంకం విధించగా, అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు మరో 25% జరిమానా విధించారు. దీంతో మొత్తం 50% సుంకం భారత్‌పై అమలులోకి వచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment