మీ కుటుంబంలో ఎవ‌రూ చ‌నిపోలేదు క‌దా..? – లోకేష్ అసహనం (Video)

మీ కుటుంబంలో ఎవ‌రూ చ‌నిపోలేదు క‌దా..? - లోకేష్ అసహనం (Video)

Summarize with AI

విశాఖ ఉక్కు కర్మాగారంలో (Visakha Steel Plant) జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పర్యటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఆసుపత్రి వద్ద బాధితులను పరామర్శించే క్రమంలో కార్మిక సంఘాలు(Workers’ Unions), వామపక్ష నేతలతో మంత్రి లోకేష్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. లోకేష్ వ్యాఖ్య‌ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా..”
ప్రమాద తీవ్రత, యాజమాన్య నిర్లక్ష్యంపై (Management Negligence) కార్మిక సంఘాల నేతలు, వామపక్ష ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను నిలదీసే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గల కారణాలను ప్రశ్నిస్తూ, కార్మికుల భద్రతను (Workers’ Safety) గాలికొదిలేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రశ్నలపై మంత్రి లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

“మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా.. ఇక్కడ గొడవ చేయొద్దు” అంటూ లోకేష్ కార్మిక నేతల ప‌ట్ల దురుసుగా నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరామర్శకు వచ్చి ఇలాగేనా మాట్లాడేది అంటూ కార్మిక సంఘాలు, మృతుల బంధువులు లోకేష్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా మంత్రి ప్రవర్తించారంటూ అక్కడున్న వారంతా మండిపడ్డారు.

వాగ్వాదం జరుగుతున్న సమయంలో.. “స్టీల్ ప్లాంట్‌ను మేమే కాపాడాం” అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కార్మికులు మరింతగా మండిపడ్డారు. “ప్లాంట్‌ను కాపాడింది ఇందుకేనా? అందుకేనా ఇంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయింది?” అంటూ బాధితులు, కార్మిక సంఘాల నేతలు మంత్రిని నిలదీశారు. కార్మికులు అంతటి ఆవేదనలో ఉంటే, వారి బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి.. ఒక మంత్రిగా బాధ్య‌త గ‌ల స్థానంలో ఉండి ఇలా హేళనగా, అవహేళన చేసేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

కార్మిక నేతలను, బాధితులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు, విపక్షాలు లోకేష్ తీరును తప్పుబడుతున్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్ద ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఘోరమైన అవమానమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment