పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విస్తృత తనిఖీలు చేపడుతుంది. ముఖ్యంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) అరెస్టు తరువాత అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో సిరాజ్ అరెస్టు రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజాగా కృష్ణా జిల్లా (Krishna District’s) లోని తాడిగడప (Tadigadapa) లో గత అర్ధరాత్రి (Midnight) NIA, ఇంటెలిజెన్స్ వర్గాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని 15 మందిని అదుపులోకి (Custody) తీసుకున్నారు. తదుపరి దర్యాప్తులో వీరు బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్ (Myanmar) కు చెందినవారుగా గుర్తించారు.
అదుపులోకి తీసుకున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి (Task Force Office) తరలించారు. ఉన్నత అధికారులు ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ తనిఖీలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, విశ్వసనీయ వర్గాల సమాచారంతో జరిగినట్లు తెలుస్తోంది. దేశంలోకి చొరబడి ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా జీవిస్తున్న వ్యక్తుల కదలికలపై దృష్టి సారించిన అధికారులు, ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లుగా సమాచారం. బంగ్లాదేశ్, మయన్మార్ కు చెందిన వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడంతో విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.









‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు