తల్లి పాత్రలంటే నో.. యాక్షన్ హీరోయిన్‌గా మారాలనుకుంటున్న మీనాక్షి చౌదరి!

తల్లి పాత్రలంటే నో.. యాక్షన్ హీరోయిన్‌గా మారాలనుకుంటున్న మీనాక్షి చౌదరి!

Summarize with AI

వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘లక్కీ భాస్కర్’ హిట్ తర్వాత తనకు ఎక్కువగా తల్లి పాత్రలే వచ్చాయని, ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతో వాటిని తిరస్కరించినట్లు తెలిపారు. నటిగా కొత్తదనం చూపించాలనేది తన లక్ష్యమని, ‘మా ఇంటి బంగారం’(Maa Inti Bangaaram) తరహాలో పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలో నటించాలని ఉందని చెప్పారు. ఇందుకోసం జిమ్‌లో MMA, ముయే థాయ్ (Muay Thai) వంటి మార్షల్ ఆర్ట్స్‌లో(Martial Arts) శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం నాగచైతన్య(Naga Chaitanya) సరసన నటించిన ‘వృషకర్మ’(Vrushakarma) డిసెంబర్ 4న విడుదల కానుంది. మరోవైపు హీరో కార్తీతో కలిసి నటిస్తున్న సూపర్ హీరో సినిమా షూటింగ్‌లో తనకు సంబంధించిన 60 శాతం భాగం పూర్తయిందని, డిసెంబర్‌లో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిపారు. ‘లక్కీ భాస్కర్ 2’ సీక్వెల్‌పై కూడా ఆసక్తి వ్యక్తం చేసిన మీనాక్షి, దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌లోనూ తాను భాగమైనట్లు ధృవీకరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment