జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చ‌ర్చ‌

జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చ‌ర్చ‌

న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. “ఒకే దేశం – ఒకే ఎన్నిక” విధానానికి సంబంధించిన ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.

కాంగ్రెస్, ఇతర రాజకీయపార్టీల వ్యతిరేకత
ఈ బిల్లుకు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఈ బిల్లును రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే చర్యగా పేర్కొంది. “ఇది నియంతృత్వ పాలనకు నాంది” అని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీఎంసీ, డీఎంకే కూడా ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

జమిలి ఎన్నికలకు వైసీపీ స‌హా 31 పార్టీల మద్దతు
ఈ బిల్లుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మద్దతు ప్రకటించింది. అలాగే, 31 ఇతర రాజకీయ పార్టీలు కూడా జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వ్యవహరించాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

పార్టీలు, చర్చలు..
జమిలి ఎన్నికల బిల్లును ప్రధానంగా 32 పార్టీలు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లుపై రాజ్య‌స‌భ‌లో సభలో చర్చించే అవకాశాలు పెరిగాయి, కాబట్టి ప్రభుత్వ వర్గాలు ఈ చర్చలను జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ)కి పంపాలని స్పీకర్‌ను కోరవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment