అతను తప్ప ఎవరూ చేయలేరు’.. శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్

అతను తప్ప ఎవరూ చేయలేరు'.. శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్

Summarize with AI

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’ (Kubera). ఈ సినిమాకు శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వం వహిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (Sri Venkateswara Cinemas), అమిగోస్ క్రియేషన్స్ (Amigos Creations) బ్యానర్‌పై సునీల్ నారంగ్ (Suniel Narang), పుస్కూర్ రామ్మోహన్ రావు (Puskur Ram Mohan Rao) నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చెన్నై (Chennai)లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ (Audio Launch) ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్‌పై ప్రశంసలు కురిపిస్తూ “ఈ సినిమాతో ధనుష్ మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని నమ్ముతున్నా. ఈ చిత్రం అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఈ పాత్రను ధనుష్ తప్ప మరెవరూ ఇంత గొప్పగా పోషించలేరు” అని అన్నారు.

నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ, “ధనుష్ ఒక అంతర్జాతీయ నటుడు. అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. శేఖర్ కమ్ముల, ధనుష్.. మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారు?” అని సరదాగా ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment