దసరా బరిలో జైలర్-2.. ఐమాక్స్ మోడ్‌లో వర‌ల్డ్‌ వైడ్ వేట!

దసరా బరిలో జైలర్-2.. ఐమాక్స్ మోడ్‌లో వర‌ల్డ్‌ వైడ్ వేట!

Summarize with AI

ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ‘జైలర్’ (Jailer) మానియా మళ్లీ మొదలైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) సరసన బాక్స్ ఆఫీస్ విలయతాండవం సృష్టించిన టైగర్ ముత్తువేల్ పాండియన్ (Tiger Muthuvel Pandian) మళ్లీ థియేటర్లను ఊపేయడానికి సిద్ధమయ్యాడు. బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘జైలర్-2’ (Jailer 2) రిలీజ్ డేట్‌ను (Release Date) మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘జైలర్-2’ గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సారి వేట మామూలుగా ఉండబోదని, గ్లోబల్ రేంజ్‌లో IMAX (ఐమాక్స్) స్క్రీన్లలో విజువల్ వండర్‌గా రాబోతోందని స్పష్టం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు.

వరల్డ్ వైడ్ ఐమాక్స్ స్క్రీన్లపై రజినీ హుకూమ్!
సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మాతల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాటిక్ స్పెక్టాకిల్‌కు సంబంధించిన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా హెవీ పోస్టర్‌ను రివీల్ చేశారు. “అక్టోబర్ 15 నుంచి ఐమాక్స్ స్క్రీన్ల వేట షురూ” అంటూ ఇచ్చిన క్యాప్షన్ రజినీ అభిమానుల్లో, సినీ ప్రియుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తన మార్క్ డార్క్ కామెడీ, హెవీ యాక్షన్ హైప్‌తో ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో అనిరుధ్ (Anirudh) అందించిన ‘హుకూమ్’ బిజిఎమ్ ఏ రేంజ్‌లో మారుమోగిందో తెలిసిందే. ఇప్పుడు పార్ట్-2 ఐమాక్స్ ఫార్మాట్‌లో రానుండటంతో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది.

తెలుగులో సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ‘జైలర్-2’ గ్రాండ్ రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) కైవసం చేసుకుంది. తెలుగులో భారీ స్థాయిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సితార బ్యానర్ సన్నాహాలు చేస్తోంది.

కూలీ, జైలర్ లాంటి ప్రాజెక్టులతో వరుసగా బాక్స్ ఆఫీస్ దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. అక్టోబర్ 15న దసరా రేసులో థియేటర్లలో శివతాండవం ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ మరోసారి మాస్ జాతర చూపించేందుకు రెడీ అయిపోయాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment