తమిళనాట నటుడు, టీవీకే అధినేత దళపతి విజయం ఏపీలో కాకరేపుతోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, తాజాగా జనసేన పార్టీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కోనేటి హరి రాయల్, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో టీవీకే (TVK) పార్టీ విజయంతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్‌ని చూసి ఏం నేర్చుకున్నారు?
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ హరి రాయల్ పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. “అక్కడ విజయ్ సీఎం అయ్యారు, వాళ్ల అభిమానులు ఆనందంతో డాన్స్ చేస్తున్నారు. కానీ మీరు సీఎం ఎలాగూ అవ్వలేరు, కనీసం మేము డాన్స్ చేసే పరిస్థితి కూడా లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ వెనుక ఎలాంటి కులం లేదని, కానీ పవన్ కళ్యాణ్ వెనుక ఒక కులం ఉందని, కేవలం ఆ కులం కోసమే తాము ఆయన వెంట నడుస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కార్యకర్తలు అంటరానివాళ్లా?
పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలను పవన్ కళ్యాణ్ కలవకపోవడంపై హరి రాయల్ మండిపడ్డారు.”కనీసం మమ్మల్ని కలవడానికి మీకు సమయం ఉండదా? మేమేమన్నా అంటరానివాళ్ళమా?” అని నిలదీశారు. జనాల్లో పార్టీ మీద నమ్మకం పోయిందని, నాయకులకు సమాజంలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందారు. పార్టీ నిర్మాణం చేపట్టకుండా, కేవలం సోషల్ మీడియాలో ‘100% స్ట్రైక్ రేట్’ అని చెప్పుకోవడం దేనికి పనికిరాదని విమర్శించారు.
వీరుడు అనుకుంటే.. బానిసలను చేశాడు
పవన్ కళ్యాణ్ ఏదో వీరుడు, శూరుడు లాగా ప్రజలను ఆదుకుంటారని భావించామని, కానీ ఆయన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని హరి రాయల్ సెల్ఫీ వీడియోలు వెల్లడించారు. “మమ్మల్ని బానిసలుగా ఎందుకు చేస్తున్నారు? మా మీద మాకే అసహ్యంగా ఉంది” అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్‌పై, సొంత పార్టీ నాయకుడే ఈ స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. దీనిపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
పవన్ కళ్యాణ్ గారు.. మమ్మల్ని బానిసలుగా ఎందుకు చేస్తున్నారు?
— Telugu Feed (@Telugufeedsite) May 6, 2026
టీవీకే పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న విలువ చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్‌ను నిలదీసిన అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ కోనేటి హరి రాయల్
కనీసం కార్యకర్తలను కూడా కలవకపోతే ఎలా? విజయ్‌ని చూసి ఏం నేర్చుకున్నారు?… pic.twitter.com/LD9uXdsZ4I








