కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి షాక్

కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి షాక్

తిరువూరు (Tiruvuru) టీడీపీ (TDP)లో పార్టీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao) టెన్షన్‌ పట్టుకుంది. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) వర్గీయులకు కొలికపూడి ఊహించని షాకిచ్చారు. టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో, టీడీపీలో గ్రూపు రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుల దోపిడీని బయటపెట్టారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తూ పోస్టులు, వాట్సప్ స్టేటస్‌లు పెట్టారు. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి??? పేకాట క్లబ్ కా???. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్’ అని సటైర్లు వేశారు. దీంతో, తిరువూరులో కొలికపూడి వరుస పోస్టులు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇటీవలే సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సమక్షంలో కొలికపూడి, కేశినేని చిన్ని వ్యవహారాలపై పంచాయతీ కూడా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటూ కేశినేని చిన్నిపై కొలికపూడి ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. చిన్ని అవినీతిపై వరుసగా పోస్టులు, మీడియాకు లీకులిచ్చి కొలికపూడి కలకలం రేపారు. దీనిపై సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ చేసి సెటిల్ చేసినా ఇంకా ఈ వ్యవహారం సద్దుమణగకపోగా మరింత రాజుకుంటోందని టీడీపీలో చర్చ జరుగుతోంది. నిన్నగాక మొన్న ఇండిగో వ్యవహారంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి ఫెయిల్యూర్ తో పార్టీ పరువు పోయిందని, ఇప్పుడు మళ్లీ కొలికపూడి ఎంటరయ్యాడని చర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment