సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ‘పాకిస్థాన్’ (‘Pakistan’) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (G.Kishan Reddy) తీవ్రంగా మండిపడ్డారు. “పాకిస్థాన్‌లో పేలని బాంబులు జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో పేలుతాయంటూ” రేవంత్ అవమానకరంగా మాట్లాడారని ఆయన విమర్శించారు. తాము ఇచ్చిన హామీలు (promises) నెరవేర్చకపోతే, ప్రజల తరఫున కార్పెట్ బాంబు దాడులు (నిరసనలు, విమర్శలు) ఉంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌లో రోడ్లు లేవని, గుంతలు, అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, ఈ దుస్థితికి కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్సే (BRS బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను ఈ రెండు పార్టీలు వెన్నుపోటు పొడిచాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటారని, ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే అది మజ్లిస్‌కు వేసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారుడుగా మాట్లాడారని, భారత సైనికుల పట్ల అవమానకరంగా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి పాకిస్థాన్ వెళ్లి అక్కడి ప్రధానితో కలిసి పరిశీలించు. పాకిస్థాన్ ఒప్పుకుంది, అమెరికా చెబుతుంది, మేము సాక్ష్యాలు బయట పెట్టాం” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.








