బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. 2025 జూలైలో తమ తొలి సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట.. ఇప్పుడు రెండో బిడ్డ (Second Child) కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ శుభవార్తను కియారా అభిమానులతో పంచుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కియారా అద్వానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలో ఆమె, సిద్ధార్థ్‌ల కుమార్తె సారాయా(Saraaya) చేతిలో ఓ చిన్న తెల్లటి సాక్స్ కనిపిస్తోంది. చిన్నారి చేతికి తల్లిదండ్రులిద్దరూ అండగా నిలిచిన ఈ ఫొటో ద్వారా తమ కుటుంబంలోకి మరో కొత్త అతిథి (New Guest)రాబోతున్న విషయాన్ని కియారా వెల్లడించింది.
మాతృత్వం (Motherhood) తన జీవితంలో తీసుకొచ్చిన మార్పుల గురించి గతంలో కియారా అద్వానీ పలు సందర్భాల్లో మాట్లాడింది. రాజ్ షమానీ పోడ్కాస్ట్లో(Raj Shamani Podcast) మాట్లాడుతూ.. తల్లి కాకముందు ఉన్న తనతో పోలిస్తే ఇప్పుడు తాను పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారిపోయానని చెప్పింది. తల్లిగా మారిన తర్వాత తనలో మరింత ధైర్యం వచ్చిందని, తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు తాను “టైగ్రెస్”లా మారిపోయానని కియారా పేర్కొంది.
‘షేర్షా’తో మొదలైన ప్రేమ.. 2023లో పెళ్లి
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమకథ ‘షేర్షా’ సినిమా షూటింగ్ సమయంలో మొదలైనట్లు బాలీవుడ్లో చాలాకాలంగా ప్రచారం ఉంది. 2020 నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణంపై వార్తలు వచ్చినప్పటికీ, ఇద్దరూ తమ బంధాన్ని బహిరంగంగా ధృవీకరించలేదు. 2022లో ‘కాఫీ విత్ కరణ్’(Koffee With Karan) కార్యక్రమంలో కరణ్ జోహార్(Karan Johar).. కియారాను సిద్ధార్థ్ గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రస్తావించడంతో వీరి రిలేషన్‌షిప్‌పై మరింత స్పష్టత వచ్చింది.
2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ వివాహం జరిగింది. ‘షేర్షా’లో(Shershaah) సిద్ధార్థ్ కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో, కియారా డింపుల్ చీమా పాత్రలో నటించారు. ఇప్పుడు తమ కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడిని ఆహ్వానించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ స్టార్ కపుల్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రేమ, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.








