కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ లభించింది. తెలుగు ప్రేక్షకులకు ‘యుగానికి ఒక్కడు’(Yuganiki Okkadu), ఆవారా (Aawara) వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తి.. ఇప్పుడు మరోసారి వింటేజ్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌తో (Vintage Love And Entertainer) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) కార్తికి బర్త్‌డే విషెస్ (Birthday Wishes) తెలుపుతూ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో కార్తి సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తన సోషల్ మీడియా పోస్టులో నాగవంశీ.. “ఆవారా చూసినప్పుడు ప్రేక్షకులు అనుభవించిన థ్రిల్, ఎమోషన్‌ను మళ్లీ గుర్తుచేసేలా ఈ సినిమాలో కార్తిని ప్రెజెంట్ చేయబోతున్నాం” అంటూ హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది. ‘ఆవారా’ చిత్రం ఇప్పటికీ కార్తి కెరీర్‌లో క్లాసిక్ రొమాంటిక్ రోడ్ జర్నీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే తరహా వింటేజ్ వైబ్స్‌తో కొత్త కథను తీసుకురాబోతున్నట్లు సంకేతాలు రావడంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై భారీగా చర్చిస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.








