కాజల్ కొత్త ఇన్నింగ్స్…బోల్డ్ రోల్స్, దర్శకత్వ అరంగేట్రం

కాజల్ కొత్త ఇన్నింగ్స్...బోల్డ్ రోల్స్, దర్శకత్వ అరంగేట్రం

Summarize with AI

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన సంగతి తెలిసిందే. 2007లో ‘లక్ష్మి కళ్యాణం’ (Lakshmi Kalyanam), ‘చందమామ’ (Chandamama) వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు లభించాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన కాజల్.. పెళ్లి తర్వాత సినిమాల జోరును తగ్గించింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ, పిల్లలు కారణంగా కొంత గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఆమె తన రాబోయే చిత్రాల గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బోల్డ్ పాత్రలకు సిద్ధమవుతున్న కాజల్?
తాజాగా సినీ వర్గాల్లో వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే, కాజల్ త్వరలో బోల్డ్ పాత్రల్లో (Bold Roles) కనిపించబోతోందట. ఇప్పటికే తమన్నా, ఇలియానా, టబు వంటి సీనియర్ హీరోయిన్లు బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నేపథ్యంలో, కాజల్ కూడా ఇదే దారిలో వెళ్తోందని టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డైరెక్టర్‌గానూ అరంగేట్రం?
ఇక మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, కాజల్ అగర్వాల్ త్వరలో దర్శకురాలి (Director)గా కూడా మారబోతోందట. తన దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను కూడా పోషించబోతోందని సమాచారం. ఈ సినిమాపై కూడా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాజల్ ప్రస్తుత ప్రాజెక్టులు
ప్రస్తుతం కాజల్ ‘కన్నప్ప’ (Kannappa) చిత్రంలో పార్వతిగా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న విడుదల కాబోతోంది. అలాగే ఆమె ‘ది ఇండియన్ స్టోరీ’, ‘ఇండియన్ 3’, బాలీవుడ్ ‘రామాయణ్: పార్ట్ 1’ వంటి ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment