జూబ్లీహిల్స్‌ బైపోల్‌ బిగ్‌ అప్డేట్‌ – అభ్యర్థులకు గుర్తులు

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ బిగ్‌ అప్డేట్‌ – అభ్యర్థులకు గుర్తులు

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) అసెంబ్లీ (Assembly) ఉపఎన్నిక (By-Election)కు సంబంధించి ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. అన్ని దశలు పూర్తవగా, అభ్యర్థుల తుది జాబితా ఖరారై గుర్తుల (Symbols) కేటాయింపు (Allocation) కూడా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని రిటర్నింగ్‌ అధికారి సాయిరాం (Sai Ram)  తెలిపారు. పోలింగ్‌ నవంబర్‌ 11న జరగనుంది.

ప్రధాన పార్టీల అభ్యర్థులు – గుర్తులు
బీజేపీ (BJP) అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (Lankala Deepak Reddy)– కమలం (Lotus) గుర్తు (బ్యాలెట్ పేపర్‌లో మొదటి స్థానం)
కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) – చేయి (Hand) గుర్తు (రెండో స్థానం)
బీఆర్ఎస్‌ (BRS) అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ (Maganti Sunitha Gopinath) – కారు(CAR) గుర్తు (మూడో స్థానం)

ఈసారి ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, యువ నాయకులు, రైతు సంఘాలు, విద్యార్థి ప్రతినిధులు పోటీలో ఉన్నారు. మొత్తం 211 మంది నామినేషన్లు దాఖలవగా, 81 మంది అర్హత సాధించారు. వారిలో 23 మంది ఉపసంహరణ చేసుకోగా, తుది జాబితాలో 58 మంది అభ్యర్థులు నిలిచారు.

జూబ్లీహిల్స్‌ చరిత్రలోనే అత్యధిక పోటీ
విశ్లేషకుల ప్రకారం.. ఈసారి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం చరిత్రలోనే రికార్డు స్థాయి పోటీ జరుగుతోంది. 2009లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో 18 మంది, 2023లో 19 మంది పోటీ పడగా, ఈసారి 58 మంది బరిలో నిలవడం విశేషం. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాగంటి గోపీనాథ్‌ మరణంతో ఉపఎన్నిక అనివార్య‌మైంది. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఎన్నికలో ప్రతి పార్టీ తమ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment