జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. బిగ్ అప్డేట్

జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఖ‌రారు..?

Summarize with AI

ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పున‌కు తెర లేవబోతోందా? గత కొన్నేళ్లుగా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిన జూ.ఎన్టీఆర్ (Jr. NTR) (తారక్) రాజకీయ అరంగేట్రంపై ఎట్టకేలకు ఒక స్పష్టత రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ వర్గాల సమాచారం. తమిళనాడులో(Tamil Nadu) దళపతి విజయ్ (Thalapathy Vijay) తరహాలోనే.. ఏపీలో(Andhra Pradesh) తారక్ కూడా ఒక పక్కా వ్యూహంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలోనే ఈనెల 18వ తేదీన తిరుపతిలోని(Tirupati) తాజ్ హోటల్‌లో (Taj Hotel) జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించబోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తారక్ (Tarak) ఇప్పుడప్పుడే నేరుగా రాజకీయ పార్టీ పేరు ప్రకటించకుండా, మొదట ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. తన తాత నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సమాజ సేవ చేయడమే లక్ష్యంగా సరికొత్త సేవా యజ్ఞానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగానే “ఊరువాడ” (Ooruvaada) అనే పేరుతో ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. తమిళ హీరో విజయ్(Vijay) కూడా పార్టీ పెట్టే ముందు ఇలాంటి గ్రౌండ్ వర్క్ చేశారన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

తారక్ పొలిటికల్ ఎంట్రీ చర్చ మొదలవ్వడమే ఆలస్యం.. అటు TDP అధినాయకత్వంలో తీవ్ర గుబులు మొదలైనట్లు టాక్. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు, పాతతరం టీడీపీ నేతలు(TDP Leaders), ప్రస్తుత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ వార్తపై ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అయితే తారక్ ఎంట్రీ ఇస్తే.. చంద్రబాబు(Chandrababu), లోకేష్(Lokesh) ఆధీనంలో ఉన్న ప్రస్తుత టీడీపీకే అతిపెద్ద నష్టం, ప్రమాదం పొంచి ఉందని విశ్లేషిస్తున్నారు.

గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) ఏర్పాటు చేసిన “అన్నా తెలుగుదేశం”(Anna Telugu Desam) పార్టీ పేరును మళ్లీ తెరపైకి తెచ్చి.. ఆ వేదిక ద్వారానే తారక్ రాజకీయ అరంగేట్రం చేసే యోచనలో ఉన్నట్టు ఆసక్తికర చ‌ర్చ న‌డుస్తోంది. చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పాతతరం టీడీపీ నేతలకు, నందమూరి వీరాభిమానులకు ‘అన్నా తెలుగుదేశం’ ఒక పక్కా ప్రత్యామ్నాయ వేదికగా మారుతుందని పొలిటికల్ టాక్.

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
జూనియర్ ఎన్టీఆర్ కనుక సొంతంగా పొలిటికల్ ప్లాట్‌ఫారమ్ ప్రకటిస్తే, అది ఆంధ్రా రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించడం ఖాయం. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ ఇమేజ్, తారక్ క్రేజ్ కారణంగా తెలుగుదేశం పార్టీలోని మెజార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకులు అటు వైపు కదిలే అవకాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వైసీపీ (YSRCP) నుంచి ఒకరిద్దరు తారక్ వైపు గోడ దూకే ఛాన్స్ ఉన్నా.. ప్రధానంగా డ్యామేజ్ జరిగేది మాత్రం తెలుగుదేశం పార్టీకేనని గట్టిగా చెప్తున్నారు.

మొదట ‘ఊరువాడ'(Ooruvaada) సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో పొలిటికల్ గేర్ మార్చాలని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈనెల 18న తిరుపతి వేదికగా జరగబోయే ప్రెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయబోతున్నారు? తన అభిమానులకు, ఆంధ్రరాష్ట్ర ప్రజలకు (Andhra State Peoples) ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నారు? అనే ఉత్కంఠకు తెరపడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

Join WhatsApp

Join Now

Leave a Comment