డ్యాన్సర్స్ వివాదం.. పవన్‌తో ఫొటోలు చూపించి జానీ బెదిరింపులు?

డ్యాన్సర్స్ వివాదం.. పవన్‌తో ఫొటోలు చూపించి జానీ బెదిరింపులు?

Summarize with AI

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్(Johnny Master), శేఖర్ మాస్టర్ (Shekhar Master) వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో(Telugu Film Dancers Association) ఎన్నికల నిర్వహణ, బై ఎలక్షన్స్(By Elections), ఏకపక్ష నిర్ణయాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆదివారం హైదరాబాద్‌లోని (Hyderabad) అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

శేఖర్ వర్సెస్ జానీ దంపతులు
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో (Dancers Association) అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై శేఖర్ మాస్టర్ గ్రూప్, జానీ మాస్టర్, ఆయన భార్య సుమలత (Sumalatha) (ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షురాలు) వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అసోసియేషన్ సమావేశంలో ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లొల్లికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్దిచెప్పాల్సి వచ్చింది. జానీ మాస్టర్ దంపతుల వైఖరిపై సాధారణ డ్యాన్సర్లు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

10 మంది కమిటీ సభ్యుల రాజీనామా
తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రెసిడెంట్ సుమలత సిద్ధపడటంపై కమిటీ సభ్యులు (Committee Members) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసోసియేషన్‌లో జానీ మాస్టర్ దంపతులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ 10 మంది కమిటీ సభ్యులు తమ పదవులకు ముకుమ్మడిగా రాజీనామా(Resignation) చేశారు. ప్రస్తుత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సదరు సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

పొట్టకొడుతున్నారు.. బెదిరిస్తున్నారు
ఈ వివాదంలో జానీ మాస్టర్‌పై డ్యాన్సర్లు పలు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అసోసియేషన్ నుంచి బ్యాన్ అయిన ఒక వ్యక్తికి, నిబంధనలకు విరుద్ధంగా జానీ మాస్టర్ వర్క్ పర్మిషన్ ఇప్పించారని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నించిన డ్యాన్సర్లను.. తనకు రాజకీయంగా ఉన్న పలుకుబడిని, పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) దిగిన ఫొటోలను చూపిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. స్థానిక తెలుగు డ్యాన్సర్ల అవకాశాలను దెబ్బతీస్తూ, వారి పొట్టకొట్టేలా జానీ మాస్టర్ వ్యవహరిస్తున్నారని తోటి కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూపుల మధ్య ఈ రేంజ్ లో గొడవ జరగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment