ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో(Coalition Government) ప్రజాధనం(Public Funds) దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి ప్రతిపక్షాలు(Opposition Parties) కూడా అక్కర్లేదు.. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే బండారాన్ని బట్టబయలు చేస్తున్నారు.
తాజాగా గన్నవరం(Gannavaram) నియోజకవర్గ టీడీపీ(TDP) ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkata Rao) తన సొంత ప్రభుత్వంపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ (Airport Terminal)టెర్మినల్ కాంట్రాక్టుల(Contractors) కేటాయింపులో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్న క్రమంలో భారీ దోపిడీని బహిరంగంగానే ఎండగట్టారు.
గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ (Airport Terminal Contract) పనులకు సంబంధించిన నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లెక్కలతో సహా నిలదీశారు. టెర్మినల్ పనుల్లో దాదాపు 80 శాతం పనులు కేవలం రూ.300 కోట్లతో పూర్తయితే.. మిగిలిన కేవలం 20 శాతం పనుల కోసం ఏకంగా రూ.206 కోట్లు ఎలా కేటాయిస్తారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని టీడీపీ నేతలు(TDP Leaders), వారి అనుకూల కాంట్రాక్టర్లు ఏ విధంగా దోచుకుంటున్నారో ఈ లెక్కలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
“ఎన్నికల ముందు పార్టీ కోసం మేం రక్తం కూడు చేసుకుని, రెక్కల కష్టం ఖర్చు పెట్టి యుద్ధం చేస్తే.. మాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా?” అని యార్లగడ్డ తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. KMV అనే సంస్థకు తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు కోట్లు విరాళాల పేరుతో లంచాలు తీసుకుని, తన రాజకీయ ప్రత్యర్థుల కోసం పనిచేసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం క్షమార్హం కాని నేరమని ఆయన తేల్చి చెప్పారు.
“నన్ను ఏరోజూ కలవని వారు ఈ రోజు టీడీపీ(TTD) అని చెప్పుకుంటున్నారు. నా నియోజకవర్గంలో అవినీతి జరిగితే కచ్చితంగా ఎండగడతా.. ఎవరినీ ఉపేక్షించను. విరాళాలు ఇచ్చి పనులు చేయించుకునే వారికి చరమగీతం పాడాలి” అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో కార్యకర్తల మీటింగ్
నియోజకవర్గంలో ప్రోటోకాల్ పరంగా తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, స్థానిక ఎమ్మెల్యేని కాదని సీఎం చంద్రబాబు(Nara Chandrababu Naidu), లోకేష్‌ల(Nara Lokesh) చుట్టూ తిరిగే పెద్దలకే ప్రాధాన్యత ఇవ్వడంపై యార్లగడ్డ మండిపడ్డారు. “నన్ను ఇలా అవమానిస్తే నేను ఊరుకునేది లేదు. గన్నవరంలో నా హక్కుల విషయంలో నేను రాజీ పడను” అని అధిష్టానానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే కార్యకర్తల మీటింగ్ పెట్టి, భవిష్యత్ కార్యాచరణతో పాటు అన్ని విషయాలూ బయటపెడతానని ప్రకటించడంతో గన్నవరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
సొంత పార్టీ ఎమ్మెల్యేనే కూటమి ప్రభుత్వ భాగోతాన్ని బట్టబయలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. కాంట్రాక్ట్‌ల పేరుతో ప్రజాధనం లూటీ అవుతుందన్న విషయాన్ని ఎమ్మెల్యే బహిర్గతం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి యార్లగడ్డ తిరుగుబాటుపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
80 శాతం పనులకు రూ.300 కోట్లు.. 20 శాతం పనులకు రూ. 206 కోట్లా..?
— Telugu Feed (@Telugufeedsite) July 13, 2026
సొంత ప్రభుత్వంపై మండిపడిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే
గన్నవరం టెర్మినల్ పనులను తన ప్రత్యర్థి కోసం పనిచేసిన వారికి కేటాయించడంపై టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆగ్రహం
నన్ను ఇలా అవమానిస్తే… pic.twitter.com/sLfrdEo2xp








