ఇది కూడా అరవ శ్రీధర్‌పై వేసిన కమిటీ లాంటిదేనా..?

ఇది కూడా అరవ శ్రీధర్‌పై వేసిన కమిటీ లాంటిదేనా..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అధికార కూటమిలోని జనసేన పార్టీ (Jana Sena Party) ఎమ్మెల్యేలపై(MLAs) బ‌య‌ట‌ప‌డుతున్న‌ అవినీతి(Corruption), రాసలీలలు, అక్రమాల (Irregularities) వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యేలతో పోటీపడి మరీ జనసేన ప్రతినిధులు చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరం (Polavaram) జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(Chirri Balaraju) మట్టి మాఫియాకు (Sand Mafia) అండగా నిలవడమే కాకుండా, దగ్గరుండి మరీ నగదు పంపకాలు చేస్తున్న సెటిల్‌మెంట్ వీడియో (Settlement Video)సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. పార్టీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతినడంతో, అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) “చిరాకు, విసుగు చెందారు” అంటూ హడావిడిగా పార్టీ పరంగా హైలెవెల్ విచారణ కమిటీని ప్రకటించారు. అయితే ఈ విచారణ కమిటీల ప్రకటన కేవలం ప్రజల నుంచి వస్తున్న తీవ్ర ఆగ్రహాన్ని, దృష్టిని మళ్లించే కంటితుడుపు చర్యగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘అరవ శ్రీధర్’ కమిటీ ఏమైంది?
గతంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) రాసలీలల వివాదం తీవ్ర దుమారం రేపినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే త్రిసభ్య కమిటీ (Three-Member Committee)అంటూ హడావిడి చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆ త్రిసభ్య కమిటీ పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన రిపోర్టు ఏమిటో, అందులో శోధించిన నిజానిజాలేమిటో ఇప్పటివరకు బయటకు వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఒకవైపు శ్రీధర్‌పై ఎలాంటి విచారణ జరగకుండానే, న్యాయం కోసం మంగళగిరి (Mangalagiri) జనసేన కార్యాలయానికి వచ్చిన బాధితురాలిపై జనసేన నాయకులు దాడులకు (Attacks) తెగబడ్డారు. న్యాయం చేయాల్సిన పవన్ కళ్యాణ్ బాధితురాలికి మొహం చాటేయడమే కాకుండా, బాధితురాలిపైనే అక్రమ కేసులు పెట్టి వేధించిన ఉదంతం తీవ్ర విమర్శలకు దారితీసింది.

అక్రమాలను పక్కదారి పట్టించే కుట్రా..?
కమిటీలు, విచారణల పేరుతో జనసేన ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, రాసలీలల అంశాలను పక్కదారి పట్టించడం అలవాటుగా మారిపోయింది. తప్పులు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవడంలో నాయకత్వం పూర్తిగా చేష్టలుడిగి వ్యవహరిస్తోందని ప్రజల్లో భావన వ్యక్తమవుతోంది. తాజాగా చిర్రి బాలరాజు వ్యవహారంలో వేసిన కమిటీ కూడా గతంలో అరవ శ్రీధర్‌పై వేసిన కమిటీ లాంటిదేనని, ఈ విచారణల డ్రామా వెనుక అసలు ఉద్దేశం ఎమ్మెల్యేను కాపాడటమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment