ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల (Unemployed Candidates) నుంచి జనసేన నాయకురాలు (Jana Sena Leader) కోట రుక్మిణీ అండ్ టీమ్ (Kota Rukmini Team) రూ.7 కోట్ల మేర వసూలు చేశారనే కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన నాయకురాలు కోట రుక్మిణీ(Kota Rukmini), శివ శ్రీనివాస్ (Shiva Srinivas) పేర్లతో ముడిపడిన ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సీఐడీకి అప్పగించారు. అయితే, నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసును సీబీఐకి(CBI) అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
నిరుద్యోగుల (Unemployed Candidates) నుంచి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ధరణి కృష్ణ(Dharani Krishna), పెద్దిరాజుపై (Peddiraju) మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జనసేన నాయకురాలు కోట రుక్మిణీ అండ్ టీమ్ నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని, స్కామ్ బయటపడడంతో సాధారణ ఉద్యోగి అయిన తనను ఈ కేసులో ఇరికించారని పోలీసుల విచారణ అనంతరం ధరణి కృష్ణ (Dharani Krishna) చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
కేకే నుంచి నాకు ప్రాణహాని ఉంది: ధరణి కృష్ణ
జనసేన నేత కేకే (KK) నుంచి తనకు ప్రాణహాని ఉందని ధరణి కృష్ణ ఆరోపించారు. తనకు ఏం జరిగినా మంగళగిరి రూరల్ సీఐ, ఎస్ఐలదే బాధ్యత అని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతోనే పోలీసులు తనను విడిచిపెట్టారని వెల్లడించారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించడంతో పాటు పోలీసుల విచారణ పేరుతో వేధించారని ఆరోపించారు.
పోలీసుల వ్యవహారశైలిపై ధరణి కృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన నాయకుల ఒత్తిడితోనే ధరణి కృష్ణపై కేసులు నమోదైనట్టుగా బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును కూటమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీఐడీకి(CBI) అప్పగించడంపై మళ్లీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు నిందితులను వదిలేసి, సాదారణ ఉద్యోగులను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన డబ్బు ఎవరికి చేరింది? ఈ వ్యవహారంలో జనసేన నేత కోట రుక్మిణీ పాత్ర ఎంత? ధరణి కృష్ణపై నమోదైన కేసుల్లో వాస్తవాలేమిటి? అనే అంశాలు సీఐడీ దర్యాప్తులో బయటపడనున్నాయా..? వేచి చూడాలి.








