జనసేనలో వర్గపోరు.. తాజాగా మరో జిల్లా!

జనసేనలో వర్గపోరు.. తాజాగా మరో జిల్లా!

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో (Jana Sena Party) అంతర్గత విభేదాలు, వర్గపోరు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల ప్రకాశం(Prakasam), నెల్లూరు (Nellore) జిల్లాల్లో(Districts) నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగా ఆయా జిల్లాల కమిటీలను (District Committees) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏకంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడి చల్లారక ముందే.. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గోపాలపురంలో జనసేన అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి.

గోపాలపురం (Gopalapuram) నియోజకవర్గ ఇన్చార్జి సువర్ణ రాజు (Suvarna Raju) తీరుపై స్థానిక నాయకులు, పాత కాపులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సువర్ణ రాజు(Suvarna Raju), ఫాతిమారాణిల (Fatima Rani) మధ్య ఉన్న వర్గపోరు ఇప్పుడు బహిర్గతమైంది. తాజాగా దేవరపల్లి గ్రామ కమిటీల (Devarapalli Village Committees) మార్పు అంశం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. గ్రామ కమిటీల మార్పుపై దేవరపల్లి గ్రామ జనసేన అధ్యక్షుడు కంబాల సత్తిబాబుతో (Kambala Sattibabu) పాటు ఇతర ముఖ్య నేతలు నియోజకవర్గ ఇన్చార్జిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావం (2014) నుండి పార్టీ జెండా మోసి, కష్టకాలంలోనూ పార్టీ కోసం పనిచేసిన తమపై ఇన్చార్జి సువర్ణ రాజు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కంబాల సత్తిబాబు బహిరంగంగానే ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి ఇటీవల జనసేనలోకి వచ్చిన వారిని సువర్ణ రాజు నెత్తిన పెట్టుకుంటున్నారని, సొంత పార్టీ క్యాడర్‌ను (Party Cadre) మాత్రం తొక్కిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం పక్కనబెట్టి, సువర్ణ రాజు కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభం కోసమే పార్టీని వాడుకుంటున్నారని విమర్శించారు.

నియోజవర్గ ఇన్చార్జిగా ఉన్న సువర్ణ రాజును, అలాగే ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న దేవరపల్లి మండలం అధ్యక్షులను వెంటనే మార్చాలని అసంతృప్త నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గోపాలపురంలో కొత్త ఇన్చార్జిని నియమించాలంటూ త్వరలోనే జనసేన పార్టీ అధిష్టానానికి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు, గోపాలపురంలో (Gopalapuram) చెలరేగిన ఈ అంతర్గత కుంపటి జిల్లా స్థాయి నాయకుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గ్రూపు తగాదాలు ఉంటే.. ఏకంగా జిల్లా కమిటీలనే పవన్ కళ్యాణ్ రద్దు చేసేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా అధిష్టానం వద్దకు వెళ్తే.. ఏకంగా జిల్లా కమిటీపై వేటు పడుతుందని నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment