‘రాహుల్‌తో హాట్‌లైన్‌లో చంద్ర‌బాబు’ – వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

'రాహుల్‌తో హాట్‌లైన్‌లో చంద్ర‌బాబు' - వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

లోక్‌స‌భ (Lok Sabha) ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏపీ ముఖ్య‌మంత్రి (AP Chief Minister) నారా చంద్ర‌బాబు (Nara Chandrababu)ల ర‌హ‌స్య‌బంధాన్ని మాజీ (Former)  సీఎం (CM)  వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) బ‌య‌ట‌పెట్టారు. “ఓట్‌ చోరీ” ( Vote Theft ) అంటూ పెద్ద ఎత్తున మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నిక‌ల్లో (Elections) జరిగిన అక్రమాల గురించి ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేద‌ని నిల‌దీశారు. పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికల్లో (By Elections)  అధికార పార్టీ అవకతవకలపై ఆధారాలతో సహా వీడియోలు, ఫొటోలు ప్రదర్శించిన జగన్, టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన సందర్భాలను మీడియా ముందుకు తీసుకువచ్చారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ శ్రేణులు బందిపోటు దొంగ‌ల్లా ప్ర‌వ‌ర్తించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

చంద్రబాబు – రేవంత్ – రాహుల్ హాట్ లైన్
చంద్రబాబు (Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ IManickam Tagore), రాహుల్ గాంధీ (Rahul Gandhi) మధ్య ‘హాట్‌లైన్’ (Hotline) కనెక్షన్ (connection) ఉందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలు, స్కాముల గురించి మాణిక్కం ఠాగూర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించిన ఆయన, ఏపీలో మద్యం అధిక రేట్లకు అమ్మకాలు, బెల్ట్ షాపుల విస్తరణ వంటి విషయాలపై కూడా కాంగ్రెస్ నేతలు మౌనం వహించడాన్ని తప్పుపట్టారు. కానీ, తనపై మాత్రం మాణిక్కం ఠాగూర్ ప్రతిసారీ వ్యాఖ్యలు చేస్తారని ఎద్దేవా చేశారు.

ఏపీలో ఓట్ చోరీపై మౌనం ఎందుకు?
రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓట్‌ చోరీపై మాట్లాడుతున్నప్పటికీ, ఏపీలో 12.5 శాతం ఓటింగ్‌ తేడా అంశంపై నోరెత్తలేదని జగన్ ప్రశ్నించారు. ఈ విషయంపై ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ, రాహుల్ గాంధీ స్పందించకపోవడానికి కారణం చంద్రబాబుతో ఉన్న ‘హాట్‌లైన్’ సంబంధమేనని ఆయన విమర్శించారు. “వీళ్ల మధ్య పార్టీలు వేరు అయినా… అజెండా ఒక్కటే” అంటూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఏపీ–తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment