ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. హమాస్ టాప్ కమాండర్ హతం

Israel drone strike, Hamas commander killed, Israel Gaza conflict, Hamas October 7 attack, IDF operations

Summarize with AI

2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై జరిగిన ఘోర దాడిలో కీలక పాత్ర పోషించిన హమాస్‌ టాప్ కమాండర్ అల్‌హదీ సబాను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చినట్లు ప్రకటించింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉన్న శరణార్థి సహాయ కేంద్రంలో సబాను గుర్తించి, డ్రోన్‌ దాడితో అతడిని చంపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) వెల్లడించింది.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని ఇ కిబ్జట్ నిర్ ఓజ్ ప్రాంతంలో హమాస్ చేసిన దాడిలో అల్‌హదీ సబా కీలక పాత్ర పోషించాడు. అతను యూదులను టార్గెట్‌గా చేసి, దాడులు జరిపి, చాలా మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, పలువురిని కిడ్నాప్ చేశాడు.

హమాస్ దాడి, ఇజ్రాయెల్ ప్రాతీభావం
ఈ దాడి ద్వారా, హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పౌరులను దాడి చేసి, వందల కొద్ది వ్యక్తులను హతమార్చారు, మరికొన్ని వారిని బందీలుగా తీసుకెళ్లారు. దాడులకు ప్రతీకారంగా, ఇజ్రాయెల్ గాజా మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఈ దాడుల్లో 45,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

Join WhatsApp

Join Now

Leave a Comment